స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 13 పాయింట్లు పెరిగి 81711 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు వృద్ధి చెంది 25017 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా లాభాల్లో ముగిశాయి.
ఎస్బీఐఎన్, అదానీ పోర్ట్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్, ఎల్అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, బజాజ్ ఫిన్ సర్వ్ ప్రధానంగా లాభాల్లో ఉండగా.. రిలయన్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాల్లో ఉన్నాయి.

ముడి చమురు ధరలు పెరగడంతో చేయడంతో భారత రూపాయి ఈ రోజు క్షీణించింది. అయితే, సానుకూల దేశీయ మార్కెట్లు ప్రతికూలతను తగ్గించాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL) మార్కెట్ రెగ్యులేటర్ ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణలను పరిష్కరించేందుకు రూ.1.3 కోట్లు చెల్లించింది.
ప్రీమియర్ ఎనర్జీస్ యొక్క రూ. 2,830-కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఆగస్టు 27 మధ్యాహ్నం నాటికి పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. ఆఫర్ పరిమాణం 4.46 కోట్ల ఈక్విటీ షేర్లకు పెట్టుబడిదారులు 4.57 కోట్ల ఈక్విటీ షేర్లను బిడ్ వేశారు.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్ప్ లిమిటెడ్ అధిక వాల్యూమ్‌ల మధ్య 17 శాతానికి పైగా ఎగబాకింది. ఒక షేరు గరిష్టంగా రూ.7,315ను తాకింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ స్టాక్ దాదాపు 69 శాతం పెరిగింది. టాటా Elxsi షేర్లు ఆగస్టు 27న ట్రేడింగ్‌లో 15 శాతం పెరిగాయి. దీంతో స్టాక్ దాని అప్‌వర్డ్ ట్రెండ్‌ను నాల్గవ వరుస సెషన్‌కు విస్తరించడమే కాకుండా, కేవలం రెండు రోజుల్లో 22 శాతానికి పైగా లాభపడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications