Stock Market Close: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 126 పాయింట్ల పెరిగి 81,867 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 59 పాయింట్లు వృద్ధి చెంది 25,010 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో పవర్ గ్రిడ్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, మారుతి, రిలయన్స్, భారతి ఎయిర్ టెల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, యాక్సెస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, టీసీఎస్ లాభాల్లో ముగిశాయి.
హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్అండ్ టా, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50లో హెచ్ డీఎఫ్ సీ, రిలయన్స్, పవర్ గ్రిడ్ లాభాల్లో ముగియగా.. ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎల్అండ్ టీ నష్టాల్లో ముగిశాయి.

భారతీయ మార్కెట్లు ఆగస్టు నెలలో 25,000 మానసిక అవరోధం కంటే బలమైన నోట్‌తో ప్రారంభమయ్యాయి. సెక్టార్లలో ఎనర్జీ టాప్ గెయినర్‌గా ఉండగా, మీడియా మరియు రియల్టీ అత్యధికంగా సరిదిద్దబడ్డాయి. మిడ్ , స్మాల్‌క్యాప్‌లు వరుసగా 0.85% & 0.98% లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications