గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 723 పాయింట్లు నష్టపోయి 71,428 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 212 పాయింట్లు పడిపోయి 21,717 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎస్బీఐఎన్, పవర్ గ్రిడ్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ లాభాల్లో ముగిశాయి.
హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, టాటా మోటార్స్, విప్రో జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, ఏసియన్ పెయింట్స్, మారుతీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100(0.05%), నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.4% దిగువన ముగిసింది.

ఐటీసీ గురువారం 4 శాతం పడిపోయింది. రూ.414 చేరింది. ఐటీసీలో పెట్టుబడి పెట్టిన బ్యాట్(BAT) ఐటీసీ వాటా విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. "బ్యాలెన్స్ షీట్ సౌలభ్యాన్ని పెంపొందించడానికి మేము అన్ని అవకాశాలను కొనసాగిస్తూనే ఉన్నాము. మేము ITCలో మా వాటాను క్రమం తప్పకుండా సమీక్షిస్తాము. మేము గణనీయమైన వాటాను కలిగి ఉన్నాము" అని ఫిబ్రవరి 8న తన Q4 ఆదాయాలలో BAT పేర్కొంది.BAT ITCలో 29.03 శాతం వాటాను కలిగి ఉంది. దీని విలువ రూ. 1.5 లక్షల కోట్లుగా ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. రెపో రేటును యథాతథంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి. జొమాటో 2023-24 ఆర్థిక సంవత్సరానికి (Q2FY24) తన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇది క్రితం సంవత్సరం వ్యవధిలో రూ.రూ.347 కోట్ల నికర నష్టంతో పోలిస్తే.. రూ.138 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది.


Click it and Unblock the Notifications