Stock Market Close: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఫార్మా రంగం..
గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగి 80,905 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 24,770 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టైటాన్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
సన్ ఫార్మా, మారుతి, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐఎన్, టాటా మోటార్స్, హెచ్ సీఎల్ టెక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, టెక్ మహింద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లుదా ఉండగా.. టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నష్టపోయాయి.

రంగాలవారీగా చూస్తే, రియల్టీ ఇండెక్స్ 1.3 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించగా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్, టెలికాం, మీడియా 0.5 నుంచి 1 శాతం మధ్య పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగింది.
యూఎస్ డాలర్ ఇండెక్స్, US ట్రెజరీ ఈల్డ్‌లలో రికవరీ కారణంగా భారతీయ రూపాయి నేడు క్షీణించింది. ఎఫ్‌ఐఐ ఔట్‌ఫ్లోలు కూడా రూపాయిపై ప్రభావం చూపాయి.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో హక్కుల ప్రాతిపదికన రూ.75 కోట్లను పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో అనుబంధ సంస్థలో కంపెనీ పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.2,652.24 కోట్లు. ఈ కొనుగోలు తర్వాత అనుబంధ సంస్థలో కంపెనీ షేర్ హోల్డింగ్ శాతంలో ఎలాంటి మార్పు కనిపించలేదు.


Click it and Unblock the Notifications