గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 147 పాయింట్ల పెరిగి 81,053 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్ల వృద్ధి చెంది 24,811 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో భారతి ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతి, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ లాభాల్లో ముగిశాయి.
హెచ్ సీఎల్ టెక్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్‌టిపిసి, విప్రో మరియు ఎం అండ్ ఎం నష్టపోయాయి.

పవర్ ఇండెక్స్ 1 శాతం క్షీణించగా.. ఫార్మా, ఆయిల్ & గ్యాస్, ఆటో, ఐటీ స్వల్పంగా నష్టపోయాయి. మరోవైపు బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, మెటల్, రియల్టీ, టెలికాం 0.5-1.4 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా భారత రూపాయి గురువారం క్షీణించింది. అయినప్పటికీ యూఎస్ డాలర్ ఇండెక్స్, ట్రెజరీ ఈల్డ్‌లలో బలహీనత ప్రతికూలతను తగ్గించింది. ముడి చమురు ధరలు తక్కువగా ఉండడంతో రూపాయికి మద్దతు లభించింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ రూ.695 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఆర్డర్‌లలో నిర్వహణ వ్యవస్థ, కమ్యూనికేషన్ పరికరాలు, మొదలైనవ సేవలు ఉన్నాయి. ఈథర్ ఇండస్ట్రీస్ SEQENS గ్రూప్ (సీక్వెన్స్) యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన కెమోక్సీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కాంట్రాక్ట్ / ఎక్స్‌క్లూజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మూడు సంవత్సరాల ప్రారంభ వ్యవధిలో ఉంటుంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications