Stock Market Closing Bell: రాణించిన బ్యాకింగ్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 82,365 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 25,235 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, సన్ ఫార్మా, భారతి ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టైటాన్, ఎల్అండ్ టీ, ఏసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యాక్సి స్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐఎన్, హిందుస్థాన్ యూనిలీవర్ లాభాల్లో ముగిశాయి.
హెచ్ సీఎల్ టెక్, మారుతి, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్, టాటా మోటార్స్ నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ ప్రధానంగా నష్టాల్లో ముగిశాయి. ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.

బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.5 శాతం, స్మాల్‌క్యాప్ 0.75 శాతం పెరిగాయి. Ecos India మొబిలిటీ, హాస్పిటాలిటీ ఐపీఓ ఆగస్ట్ 30 చివరి రోజు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం సబ్‌స్క్రిప్షన్‌లు ఇష్యూ పరిమాణం కంటే 42.22 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. న్యూఢిల్లీకి చెందిన డ్రైవర్-డ్రైవెన్ కార్ రెంటల్ సర్వీసెస్ ప్రొవైడర్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 601.2 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రోజు Paytm షేర్లు 12%కి పెరిగాయి. సెప్టెంబరులో యుఎస్ ఫెడ్ రేటు తగ్గింపు హామీలతో గ్లోబల్ మార్కెట్లు ప్రస్తుతం సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications