Stock Market: లాభాల కొనసాగింపులో సూచీలు.. అమెరికా నుంచి మద్దతుతో..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల జోరును నేడు సైతం కొనసాగిస్తున్నాయి. యూఎస్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగా ఇన్వెస్టర్లు ముందుకు సాగుతున్నారు.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 76 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 131 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 245 పాయింట్ల మేర లాభాలతో ముందుకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అదానీ ఎనర్జీ, జైడస్ లైఫ్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్‌టిఐఎమ్, టాటా మోటార్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, విప్రో, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications