Stock Market: లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. అదరగొట్టిన 3 రంగాల షేర్లు..
Market Closing: ఉదయం ఆరంభంలోనే లాభాలు ఆవిరి కావటంతో కీలక సూచీలు స్వల్ప నష్టాల బాట పట్టాయి. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి కోలుకోవటంతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 79 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ ముగించగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 397 పాయింట్ల భారీ లాభంతో ప్రయాణం ముగించింది. ప్రధానంగా నేడు మార్కెట్లలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు లాభపడటం సానుకూలంగా నిలిచింది.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, ఎల్ టి, టైటాన్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐసీటీ, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, యూపీఎల్, మారుతీ సుజుకీ, గ్రామిస్, రిలయన్స్, టీసీఎస్, సన్ పార్మాతో సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, నెస్లే, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications