Stock Market: సూపర్ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దుమ్ముదులిపిన పవర్, FMCG స్టాక్స్..
Closing Bell: స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని మంచి లాభాలతో ముగించాయి. ఉదయం ఉత్సహంగా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి అదే జోష్‌లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 493 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 333 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 474 పాయింట్ల మేర లాభపడింది. ఈ క్రమంలో ఆటో రంగానికి చెందిన షేర్లు మార్కెట్లను నష్టాలతో కిందకు లాగినప్పటికీ.. పవర్, FMCG రంగాల షేర్లు మంచి లాభాలతో సపోర్ట్ చేశాయి.

ఎన్ఎస్ఈలో ఐటీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హస్పిటల్స్, యూపీఎల్, టీసీఎస్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టిఐఎమ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, గ్రాసిమ్, టాటా కన్జూమర్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీటీసీ, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications