Stock Market: నిఫ్టీ కొత్త రోజు కొత్త రికార్డులు.. బురిడీ కొట్టించిన బ్యాంక్ నిఫ్టీ..
Market Closing: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు మరో కొత్త రికార్డును అందుకున్నాయి. బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ ఏకంగా నేడు 21,000 మార్కును తాకి తన కొత్త జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది.
స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 358 పాయింట్లు భారీ లాభాన్ని నమోదు చేయగా.. మరో సూచీ నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 178 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ప్రధానంగా ఐటీ, పవర్ రంగాలకు చెందిన షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో విప్రో, ఎల్ టిఐఎమ్, ఐటీసీ, ఎల్ టి, టీసీఎస్, టాటా మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్, ఓఎన్జీసీ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, సిప్లా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, మారుతీ, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టైటాన్, దివీస్ ల్యాబ్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications