Closing Bell: ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ ముగింపును చూశాయి. ప్రధానంగా నేడు మార్కెట్లలో ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి బెంచ్ మార్క్ సూచీలను కిందకు లాగింది.
వాస్తవానికి బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ ఈ వారాన్ని మ్యూట్ నోట్‌తో ముగిశాయి. జాక్సన్ హోల్ సింపోజియంలో యూఎస్ ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ కామెంట్స్ కోసం దేశీయ మార్కెట్లలోని పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నందున స్వల్ప అధిక స్థాయిలో ముగిశాయి. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా ఫెడ్ రానున్న సెప్టెంబర్ మాసంలో వడ్డీ రేట్లను తగ్గించనుందనే బలమైన వాదన అంతర్జాతీయంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో నేడు మార్కెట్ల క్లోజింగ్ సమయానికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు బలహీనమైన పనితీరును కనబరిచాయి.

మార్కెట్ల ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 33 పాయింట్లు పెరగగా, నిఫ్టీ సూచీ 12 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 52 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్, విప్రో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications