Closing Bell: బుల్ రంకెలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. టాప్ గెయినర్స్ ఇవే..
Market Closing: ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే జోరుతో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆటో రంగాల షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 240 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 60 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 164 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 48 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి.

మార్కెట్ల ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్వెస్టర్ల సంపద రూ.286.06 లక్షల కోట్లుగా ఉంది. విప్రో తన రూ.12,000 కోట్ల షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు జూన్ 16ని తేదీగా నిర్ణయించింది. దీంతో స్టాక్ నేడు మార్కెట్లో 8 శాతానికి పైగా లాభపడింది. బలమైన నెలవారీ ఆటో అమ్మకాలు, సెమీకండక్టర్ చిప్ కొరత పరిస్థితులను మెరుగుపరచడంతో నిఫ్టీ ఆటో ఈరోజు ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కూడా దీనికి దోహదపడింది.
ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ టి, గ్రాసిమ్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, మారుతీ, సిప్లా, రిలయన్స్, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, నెస్లే, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, టీసీఎస్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications