Closing Bell: మార్కెట్లో ఊగిసలాటలు ఉన్నప్పటికీ నేడు అన్ని సూచీలు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. నిన్న ఒత్తిడితో చిత్తైన స్మాల్ క్యాప్ సూచీలు ఉదయం అదే ధోరణి చూపినప్పటికీ తర్వాత తేరుకున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 246 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 77 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ ముగించింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 398 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 75 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ మార్కెట్లను ముందుకు నడపటంలో దోహదపడింది. అలాగే మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ర్యాలీకి దోహదపడ్డాయి.

NSEలో కోల్ ఇండియా, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, టైటాన్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యూపీఎల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎల్ టి, సిప్లా, దివీస్ ల్యాబ్స్, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఐషర్ మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, మారుతీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications