Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల ముగింపును నమోదు చేశాయి. ఫెడ్ ప్రకటన కోసం ఆసక్తిగా చూస్తున్న ఇన్వెస్టర్లు నేడు కొనుగోళ్లకు మెుగ్గు చూపటం పాజిటివ్ ముగింపుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్లు వృద్ధి చెందింది. అయితే ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 74 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. చాలా వరకు మార్కెట్లలోని పెట్టుబడిదారులు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశావాదంతో ఉన్నందున నేడు కొనుగోళ్లు చేపట్టారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, మారుతీ, నెస్లే, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, బీపీసీఎల్, ఐటీసీ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో టాటా స్టీల్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, హిందాల్కొ, యూపీఎల్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో ముగింపు నాటికి నేడు టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications