Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. క్యాబినెట్ నిర్ణయాల ఊరట..
Market Closing: ఉదయం లాభాలతో ప్రారంభమై తర్వాత ఒత్తిళ్లకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి రికవరి బాట పట్టాయి. చివరికి నేడు మార్కెట్లు ఫిబ్రవరి నెల చివరి రోజున మోడరేట్ లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 158 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 247 పాయింట్ల మేర లాభపడింది. ప్రధానంగా నేడు కేంద్రంలోని మోదీ సర్కార్ క్యాబినెట్ నిర్ణయాలు మార్కెట్ల సానుకూల ప్రయాణానికి దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో మార్కెట్ల క్లోజింగ్ సమయానికి అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, నెస్లే, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, దివీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఐటీసీ, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications