Sensex Rally: మార్కెట్లో సెన్సెక్స్-నిఫ్టీ ప్రకంపనలు.. వారాంతంలో రికార్డు ర్యాలీతో కొత్త చరిత్ర
Stock Market: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ రంగంలోని కంపెనీల మెగా ర్యాలీతో కీలక బెంచ్ మార్క్ సూచీలు కొత్త చరిత్ర సృష్టించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడి 80,893 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ దాదాపు 1 శాతం పెరుగుదలతో 24,556.60 స్థాయిలకు చేరుకుంది.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 622 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 186 పాయింట్లు లాభంతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 8 పాయింట్ల స్వల్ప లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 26 పాయింట్ల లాభపడింది. నేడు ఇంట్రాడేలో ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన షేర్లలో ర్యాలీతో మార్కెట్లు భారీ బుల్ జోరును కొనసాగించాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్‌టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, మారుతీ, టైటాన్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, ఎయిర్ టెల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications