Stock Market: అలా లాభాల్లోకి వచ్చి.. చివరికి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో నష్టాల నుంచి పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీలు తిరిగి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్ల మేర క్షీణించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ భారీగా 544 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 74 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ముగించాయి.

ప్రధానంగా దేశీయ మార్కెట్లను బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు నష్టాల్లోకి లాగగా.. ఫార్మా స్టాక్స్ మాత్రం లాభపడ్డాయి. నేడు మార్కెట్ల ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలో పెరిగి రూ.291.89 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 28 నుంచి ఇప్పటి వరకు సూచీ విలువ దాదాపు 16 శాతం మేర పెరిగింది.
మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, యూపీఎల్, గ్రాసిమ్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications