Closing Bell: ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. బేర్స్ రంగంలోకి దిగటంతో మార్కెట్లు భారీ ఒడిదొడుకులకు లోనై బెంచ్ మార్క్ సూచీలు బేజారాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 380 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 76 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 473 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 83 పాయింట్ల నష్టాన్ని నమోదు చేశాయి. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్ లలో కొనసాగుతున్న బూమ్ విషయం కూడా ఇన్వెస్టర్లను కొంత ఆందోళనలకు గురిచేస్తోంది.

మార్కెట్లు నష్టాల వైపు నడిచే విధంగా ప్రభావితం చేసిన పలు అంశాలను పరిశీలిస్తే.. ముందుగా బేర్స్ రంగంలోకి దిగటంతో ఆందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించినదానికంటే నిరాశకు దారితీయెుచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అలాగే ఎర్ర సముద్రం అంతరాయాలపై దీర్ఘకాలిక ఆందోళనలు ప్రపంచ సరఫరా గొలుసులకు, సరుకు రవాణా ఖర్చులకు స్వల్పకాలిక నష్టాలను కలిగిస్తున్నందున అధిక స్థాయిలలో ప్రాఫిట్-బుకింగ్ కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు.
NSEలో దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, హిందాల్కొ, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, బీపీసీఎల్, రిలయన్స్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, మారుతీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications