Stock Market: ఈరోజు ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొద్ది సేపు ఆ స్తబ్ధతను కొనసాగించాయి. అయితే చాలా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను విడుదల చేయగా అవి ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు నడిపాయి.
మార్కెట్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ రంగాల్లోని షేర్లు లాభపడ్డాయి. ఎఫ్ఎమ్సీజీ రంగంలోని హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ క్యూ-4 ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది కంటే ఆదాయం 11 శాతం పెరగగా.. నికర లాభం 10 శాతం పెరిగి రూ.2,552 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో బజాజ్ ఫిన్ సర్వ్ నికర లాభం క్యూ-4లో 31 శాతం పెరిగి రూ.1,769 కోట్లుగా నమోదైంది.

మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 349 పాయింట్ల లాభపడగా.. నిఫ్టీ సూచీ 101 పాయింట్ల లాభంలో ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 175 పాయింట్ల మేర పెరిగింది.
NSE సూచీలోని బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ముగిశాయి.
ఇదే క్రమంలో సూచీలోని హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా ముగిశాయి.


Click it and Unblock the Notifications