Stock Market Open: లాభాల్లో ట్రేడవుతోన్న స్టాక్ మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 28 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 81927 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 86 పాయింట్లు వృద్ధి చెంది 25037 ట్రేవుతోంది. పవర్ గ్రిడ్, మారుతి, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్ సీఎల్ టెక్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, యాక్సెస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇందుస్థాన్ యునిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సిగల్ ఇండియా లిమిటెడ్ బుధవారం పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభ షేర్-సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ. 375 కోట్లను సమీకరించినట్లు తెలిపింది.

బిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సర్క్యులర్ ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్), హెచ్‌డిఎఫ్‌సి ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, బంధన్ ఎంఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications