స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 25 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 214 పాయింట్ల కోల్పోయి 79710 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్లు నష్టోపోయి 24261 వద్ద ట్రేడవుతోంది. ఫార్మా, బ్యాంక్ స్టాక్ ల్లో ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్ ల్లో కాస్త సానుకూలత కనిపిస్తోంది. ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఈ రోజు 1.76 శాతం పెరిగింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, ఐటీసీ, టైటాన్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐఎన్, మారుతీ లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఎల్అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎంఅండ్ఎం, జేఎస్ డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా నష్టాల్లో ట్రేడవుతోన్నాయి.

ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో టీసీఎస్, కోల్ ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఏసియెన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ రెండూ తమ పోర్ట్‌ఫోలియోలలో ఒక శాతం వరకు ధరల పెంపును నిర్ధారించాయి. తద్వారా వారికి వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉండనున్నాయి. ఆదిత్య బిర్లా నేతృత్వంలోని బిర్లా ఓపస్ ప్రవేశం తర్వాత పెయింట్స్‌లో గట్టి పోటీ ఏర్పడటంతో ధరల పెంపుదలలు మార్జిన్‌లను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications