రెండో రోజూ నష్టాల్లోనే మార్కెట్లు: 220 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం మార్కెట్లు భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 3 పైసలు తగ్గి 71.11 వద్ద క్లోజ్ అయింది. నిన్నటి నష్టాల నుంచి మార్కెట్లు ఈ రోజు కూడా తేరుకోలేదు. ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ప్రారంభమైంది.
సాయంత్రం మూడున్నర గంటల సమయానికి సెన్సెక్స్ 221.07 (0.53%) పాయింట్ల నష్టంతో 41,307.84 వద్ద, నిఫ్టీ 60.15 (0.49%) 12,164.40 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.87 వద్ద ట్రేడ్ అయింది. ఆటో, మెటల్ రంగాల షేర్లు నష్టాలలో ట్రేడ్ అయ్యాయి.
బడ్జెట్ 2020: మరిన్ని కథనాలు చదవండి

టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్, కొటక్ మహీంద్రా, బ్రిటానియా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐవోసీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications