Stock Market Today: సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినప్పటికీ...
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినప్పటికీ, చివరి అరగంటలో మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. అయితే సూచీలు అతి స్వల్ప నష్టాల్లో లేదా స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ 58,418.69 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,553.07 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,005.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,401.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,436.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,287.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 17.43 (0.030%) పాయింట్లు నష్టపోయి 58,279.48 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15.70 (0.090% పాయింట్లు నష్టపోయి 17,362.10 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నప్పటికీ నేడు కాస్త ఊగిసలాట ధోరణిని కనబరిచింది. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు దిగువ స్థాయిల్లోనే కొనసాగాయి. అక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో దూసుకెళ్లిన సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. చివరకు ఇన్వెస్టర్లు మళ్లీ లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. HDFC, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు రాణించడంతో సూచీలకు మద్దతు లభించింది. సెన్సెక్స్ 58,553 వద్ద తాజా ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 17,436 వద్ద రికార్డు నెలకొల్పింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.42 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 58,553 పాయింట్ల నుండి 58,005 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్ 30 షేర్లలో 12 కంపెనీలు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, HDFC, ఇండస్ఇండ్ బ్యాంక్, ITC, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్ట్లే, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ షేర్లు మెరిశాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, HCL టెక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, డాక్టర్ రెడ్డీస్, TCS, ఎస్బీఐ డీలాపడ్డాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, HDFC, టాటా స్టీల్, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 2.59 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.44 శాతం, గ్రాసీమ్ 1.53 శాతం, ఐటీసీ 1.17 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.94 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా 1.83 శాతం, బీపీసీఎల్ 1.80 శాతం, విప్రో 1.78 శాతం, టెక్ మహీంద్రా 1.78 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.62 శాతం లాభపడింది.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.2,54,29,675.80 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1547648.25 కోట్లకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.1411095.62 కోట్లకు, HDFC బ్యాంకు లిమిటెడ్ ఎం-క్యాప్ రూ.868763.68 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.723874.73 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ ఎం-క్యాప్ రూ.652199.54 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.512382.12 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.496652.87 కోట్లకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.450018.82 కోట్లకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ 382821.21 కోట్లకు, విప్రో ఎం-క్యాప్ రూ.369442.28 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications