లాభాల్లో ముగిసిన మార్కెట్లు, టాటా మోటార్స్ టార్గెట్ జీరో డెబిట్
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం(ఆగస్ట్ 25) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీ లాభాలను చూసిన సూచీలు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనై, చివరకు స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లు చివరలో కోలుకున్నాయి. సెన్సెక్స్ 44 పాయింట్లు లాభపడి 38,843, నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 11,472 వద్ద క్లోజ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 74.32 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 74.31 వద్ద క్లోజ్ ముగిసింది.
సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. ఇది ఆరు నెలల గరిష్టం. నిఫ్టీ బ్యాంక్ ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ లాభాలను వెనక్కి లాగింది. మిడ్ క్యాప్ 58 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ బ్యాంకు 260 పాయింట్లు ఎగిసింది. టాటా మోటార్స్ రానున్న మూడేళ్లలో డెబిట్స్‌ను జీరోకు తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ఈ కంపెనీ షేర్ ఏకంగా 5 శాతం వరకు లాభపడింది.

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, శ్రీ సిమెంట్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. నగదు విభాగంలో సోమవారం FPIలు రూ.219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, DIIలు దాదాపు రూ.336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం FPIలు రూ.410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, DIIలు దాదాపు రూ.251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.


Click it and Unblock the Notifications