స్టాక్ మార్కెట్లు మంగళవారం(నవంబర్ 9, 2021) ఫ్లాట్‌గా ప్రారంభమై, అలాగే ముగిశాయి. వరుసగా 2 వారాలు నష్టపోయిన మార్కెట్లు గత దీపావళి వారం లాభాల్లో ముగిశాయి. ఈ వారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న సెన్సెక్స్ 478 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్లు నేడు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారం రికార్డుస్థాయి లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ గతవారం, అలాగే, ఈ వారంలోని రెండు రోజుల లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్లు స్థిరంగా లేదా అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
దీనికి తోడు ఎంఎస్‌సీఐ సూచీలో ఏడు భారత కంపెనీలను చేర్చనుండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికాలో ఇన్ఫ్రా బిల్లు ఆమోదం పొందనుండడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం 60,609.72 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 60,670.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 60,213.64 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,084.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,112.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,983.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

విజిల్ బ్లోయర్స్ ప్రభావంతో నిన్న నష్టపోయిన ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్ నేడు లాభపడింది. నేడు ఈ స్టాక్ 0.74 శాతం లాభపడి రూ.1,069.00 వద్ద ఉంది. నిన్న ఇండస్ఇండ్ బ్యాంకులో రుణాల పునరుద్ధరణపై విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు దానిపై సంస్థ ఇచ్చిన వివరణ నేపథ్యంలో బ్యాంకు షేర్లు ఓ దశలో 12 శాతానికి పైగా కుంగాయి. నిన్న బీఎస్ఈలో స్టాక్ ధర 12.40 శాతం కుంగి రూ.1,041.60కు చేరుకుంది. ఎన్‌ఎస్ఈలో రూ.12.40 శాతం పతమైంది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టం రూ.1,242.00, 52 వారాల కనిష్టం రూ.735.05.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications