SEBI News: చాలా కాలంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్టాక్ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే ఇన్వెస్టర్ల సౌకర్యం, భద్రతపై అత్యధిక దృష్టిని కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం ఐపీవోలకు క్రేజ్ పెరుగుతుండగా.. వాటి ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది.
స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఐపీవోల లిస్టింగ్ టైమ్‌లైన్‌ను ఇప్పటికే ఉన్న T+6 రోజుల నుంచి T+3 రోజులకు తగ్గించినట్లు ప్రకటించింది. కొత్తగా తీసుకొస్తున్న ఈ మార్పులు డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తున్నాయి. వీటి ప్రకారం ఇకపై ఐపీవో ఇష్యూ ముగింపు తేదీ నుంచి 3 రోజుల తర్వాత ఐపీవోలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జాబితా చేయబడాల్సి ఉంటుంది. అంటే తక్కువ సమయంలోనే షేర్లు ట్రేడింగ్ కోసం అందుబాటులోకి వస్తాయనమాట.

మార్కెట్ పార్టిసిపెంట్లతో విస్తృతమైన సంప్రదింపుల పర్యవసానంగా, పైన పేర్కొన్న సబ్జెక్ట్‌పై సంప్రదింపు పత్రానికి అనుగుణంగా అందిన ప్రజల స్పందనను పరిగణలోకి తీసుకున్నాకనే నిర్ణయం తీసుకున్నట్లు సెబీ వెల్లడించింది. దీనికి అనుగుణంగానే పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత పేర్కొన్న సెక్యూరిటీల లిస్టింగ్‌కు పట్టే సమయాన్ని మూడు రోజులకు తగ్గించాలని నిర్ణయించినట్లు సెబీ స్పష్టం చేసింది. దీనిని T+3 రోజులు అని అంటారు.. ఇందులో 'T' అనేది ఇష్యూ ముగింపు తేదీ.
కొత్త నియమాలు సెప్టెంబర్ 1, 2023న లేదా ఆ తర్వాత తెరవబడే పబ్లిక్ ఇష్యూలకు స్వచ్ఛంద ప్రాతిపదికన వర్తిస్తాయి. అలాగే డిసెంబర్ 1,2023న లేదా ఆ తర్వాత తెరవబడే పబ్లిక్ ఇష్యూలకు నిబంధన తప్పక వర్తిస్తుందని సెబీ తన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. దీనికి ముందు ట్రేడింగ్ సెటిల్మెంట్ సమయం తగ్గింపు, ఆప్షన్స్ ఎక్స్‌పెయిరీ రోజుల్లో మార్పులు, కొత్తగా ఏఐ వినియోగం వంటి నూతన మార్పులతో పెట్టుబడిదారుల సంరక్షణపై సెబీ అధిక దృష్టిని కేంద్రీకరించింది.
లిస్టింగ్ టైమ్‌లైన్‌లో తగ్గింపు షేర్లు కేటాయించబడని సబ్‌స్క్రైబర్‌లు తమ డబ్బును త్వరగా తిరిగి పొందేందుకు దోహదపడనుంది. అలాగే పబ్లిక్ ఇష్యూ ప్రక్రియలో స్టాక్ ఎక్స్ఛేంజీలు, బ్యాంకులు, డిపాజిటరీలు, బ్రోకర్ల వంటి అన్ని వాటాదారుల వనరులు తక్కువ వ్యవధిలో అమలు చేయబడతాయి. ఇందుకోసం కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంపెనీలు T+1 రోజున సాయంత్రం 6 గంటలలోపు కేటాయింపును ఖరారు చేయాల్సి ఉంటుంది. T+2 రోజున షేర్లు ఎలాట్ కాని దరఖాస్తుదారుల అకౌంట్లకు వారి డబ్బును తిరిగి బదిలీ చేయాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications