స్టాక్ మార్కెట్లు ఈ వారం ఎలా ఉండవచ్చు, బంగారం మద్దతు ధర
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గతవారం సానుకూలంగా ముగిశాయి. ఈ వారం కూడా సూచీలు సరికొత్త గరిష్టాలను తాకే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుదల, టీకా ఉత్పత్తి పెంచే ప్రయత్నాలు వేగవంతం కావడం పాజిటివ్ సెంటిమెంట్ మెరుగుపడింది. అయితే తమిళనాడులో మరోవారం రోజులు లాక్ డౌన్ పొడిగించడం, మహారాష్ట్రలో జూన్ 1వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్‌కు అవకాశాలు మార్కెట్ ప్రతికూలతకు అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. అయితే ప్రధానంగా కేసులు తగ్గడం మాత్రం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచే అవకాశముందని చెబుతున్నారు. అలాగే సూచీలు భారీగా జంప్ చేయడంతో ప్రాఫిట్ బుకింగ్ అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.

మద్దతు, నిరోధకం
నిఫ్టీ 50 ఈవారం 14,900 నుండి 15,400 మధ్య కదలాడొచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి నివేదిక, దేశీయంగా కార్పోరేట్ల ఆర్థిక ఫలితాలు, కరోనా పరిణామాలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్యాంకు షేర్లు ఈ వారం 33,700 నుండి 34,300 మధ్య కదలాడవచ్చునని, 34,000 పైకి వెళ్తే లాభాలు ఉండవచ్చునని చెబుతున్నారు. నిఫ్టీ నిరోధకం 15,130, 15,200. మద్దతు 15,600.

గోల్డ్ ఫ్యూచర్స్
గోల్డ్ జూన్ కాంట్రాక్టు ఈవారం రూ.47,900కు దిగువన రాకుంటే మరింతగా రాణించే అవకాశముందని, కాబట్టి రూ.48,639, రూ.48,889 టార్గెట్‌తో రూ.47,431 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని, ప్రస్తుత లాంగ్ పొజిషన్లను అట్టి పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ఈవారంలో విడుదలయ్యే కీలక గణాంకాలు ఉన్నాయి.

దిద్దుబాటు
ఎంసీఎక్స్ బుల్ డెక్స్ జూన్్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.15,000 దిగువకు రాకుంటే రూ.15,321, రూ.15,502 వరకు పెరిగే అవకాశముంది. రూ.14,949 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొత్తగా లాంగ్ పొజిషన్లను తీసుకోవచ్చు. సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.70,510 కంటే దిగువకు ట్రేడ్ అయితే రూ.69,632, రూ.68,215 వరకు దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంది.


Click it and Unblock the Notifications