For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: పంద్రాగస్టు తరువాత మార్కెట్లలో కొత్త జోరు.. జోరుమీదున్న వాల్ స్ట్రీట్.. బుల్ రంకెలు..

|

Stock Market Opening Bell: వరుస సెలవుల తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో మంచి దూకుడును కనబరుస్తున్నాయి. ఓపెనింగ్ బెల్ మోగగానే మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం9.17 గంటలకు భారీగా గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యాయి. దీనికి అంతర్జాతీయ పరిణామాలతో పాటు నిన్న ప్రధాని మోదీ భవిష్యత్తు భారత పురోగతిపై చేసిన కీలక వ్యాఖ్యల ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న కాలంలో టెక్, గ్రీన్ ఎనర్జీతో పాటు అనేక రంగాలనే పాజిటివ్ అవుట్ లుక్ ప్రకటించటం ఇందుకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోకవచ్చు.

దేశీయ సూచీల పరుగులు..

దేశీయ సూచీల పరుగులు..

దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 303 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ-50.. 83 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 280 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 123 పాయింట్లు లాభపడి మార్కెట్లు పచ్చరంగు అద్దుకున్నాయి.

అమెరికా మార్కెట్ల ప్రభావం..

అమెరికా మార్కెట్ల ప్రభావం..

ఆగస్ట్ 15న యూఎస్ మార్కెట్లలో బూమ్ కనిపించింది. ఇది మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా US స్టాక్ మార్కెట్ సందడి చేస్తోంది. ఆగస్టు 15న దేశీయ స్టాక్ మార్కెట్లు ముగియగా, వాల్ స్ట్రీట్ జనరల్ కీలక సూచీ డౌజోన్స్ 151 పాయింట్లు ఎగబాకి 33,912 స్థాయి వద్ద ముగిసింది. గత 5 ట్రేడింగ్ రోజుల్లో అక్కడి సూచీలు 1105 పాయింట్లు ఎగబాకింది. ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశీల స్టాక్ మార్కెట్లపై కూడా ఉందని చెప్పుకోవాలి.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..

ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి స్టాక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో హిందాల్కో, గ్రాసిమ్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, జేఎస్ దబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్, టైటాల్ స్టాక్స్ నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Read more about: stock market sensex nifty
English summary

Stock Market: పంద్రాగస్టు తరువాత మార్కెట్లలో కొత్త జోరు.. జోరుమీదున్న వాల్ స్ట్రీట్.. బుల్ రంకెలు.. | Stock Market Opening Bell 16-08-2022 markets in positive amid global ques

indian stock markets in positive note after independence day
Story first published: Tuesday, August 16, 2022, 9:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X