Stock Market Close: ఒక్క రోజే రూ.14 లక్షల కోట్లు ఖతం..
స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు పారింది. బేర్ పంజా దెబ్బతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్క రోజే మదుపరులు లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. సోమవారం ఒక్క రోజే దాదాపు రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2222 పాయింట్లు నష్టపోయి 78759 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 662 పాయింట్లు కోల్పోయి 24055 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా స్వల్ప లాభాల్లో ముగిశాయి.
ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, టైటాన్, యాక్సెస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ సీఎల్ టెక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్అండ్ టీ, ఇన్ఫోసిస్, మారుతి, జేఎస్ డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ నష్టపోయాయి.

ఎన్ఎస్ఈ నిఫ్టీలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ONGC, హిందాల్కో, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, టాటా కన్స్యూమర్, HDFC లైఫ్ లాభాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, మీడియా, రియల్టీ 4 శాతం చొప్పున క్షీణించాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.2 శాతం పడిపోయాయి.
విస్తృత గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాలతో సోమవారం భారతీయ రూపాయి తాజా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్‌లో మాంద్యం గురించి ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తడి కొనసాగింది. ముడి చమురు ధరల క్షీణత రూపాయిలో భారీ క్షీణతను నిరోధించాయి.


Click it and Unblock the Notifications