కుటుంబ సభ్యులు ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మీ డీమ్యాట్ అకౌంట్ వాడొచ్చా ? సెబీ ఎం చెప్తుంది..
స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే ముందుగా మీకు డిమ్యాట్ అకౌంట్ ఉండాలి. డిమ్యాట్ అకౌంట్ ఉంటేనే ట్రేడింగ్ చేయవచ్చు. ఈ ట్రేడింగ్ అకౌంట్ ఎవరైనా తీసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల డీమ్యాట్ అకౌంట్ ఆపరేట్ చేయడానికి మీరు మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించవచ్చా ? క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దీని పై తాజాగా స్పష్టం చేసింది, అనుకోని పరిస్థితులలో క్లయింట్లు ఒకే కుటుంబానికి చెందినట్లయితే స్టాక్ బ్రోకర్ ఒకరి కంటే ఎక్కువ మందికి తన మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ అప్‌లోడ్ చేయవచ్చు.
రిటైల్ ఇన్వెస్టర్ తన కుటుంబ సభ్యుల డీమ్యాట్ అకౌంట్ కొన్ని షరతులలో ఆపరేట్ చేయడానికి అతని నంబర్ లేదా ఇమెయిల్ IDని ఉపయోగించవచ్చు. ఈ ప్రయోజనం కోసం కుటుంబం అంటే సొంత, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు ఇంకా ఆధారపడిన తల్లిదండ్రులు. అనుకోని పరిస్థితుల్లో లేదా క్లయింట్ వ్రాతపూర్వక అభ్యర్థనపై మాత్రమే ఇలా సాధ్యమవుతుందని సెబీ తెలిపింది. ఈ నిబంధన కూడా తక్షణమే అమల్లోకి రానుంది.

3 డిసెంబర్ 2024 నాటి సెబి సర్క్యులర్ ప్రకారం, "స్టాక్ బ్రోకర్ల ద్వారా మొబైల్ నంబర్, ఇ-మెయిల్‌ను అప్‌లోడ్ చేయడం గురించి ఈ సర్క్యులర్ క్రింది విధంగా పేర్కొంది: స్టాక్ బ్రోకర్లు ప్రతి క్లయింట్‌కు ప్రత్యేక మొబైల్ నంబర్/ఇమెయిల్ అడ్రస్ అప్‌లోడ్ చేసేలా చూసుకోవాలి. అయితే అనుకోని పరిస్థితులలో స్టాక్ బ్రోకర్, క్లయింట్ వ్రాతపూర్వక అభ్యర్థన మేరకు క్లయింట్‌లు ఒక కుటుంబానికి చెందినవారైతే, ఒకటి కంటే ఎక్కువ క్లయింట్‌ల కోసం ఒకే మొబైల్ నంబర్ / ఇమెయిల్ అడ్రస్ అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ప్రయోజనం కోసం కుటుంబం అంటే సొంత, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు ఇంకా ఆధారపడిన తల్లిదండ్రులు.
ఇందుకు కుటుంబం లేదా హక్కుదారులు ఎవరైనా ఉంకోచ్చు:
a. ఒక వ్యక్తి, సొంత, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రుల విషయంలో ఎవరైనా
b. జాయింట్ ఫ్యామిలీ విషయంలో ఇంటికి పెద్ద లేదా న్యాయ హక్కుదారుల ముందస్తు ఆమోదం ప్రకారం ఎవరైనా.
c. పార్ట్నర్షిప్ కంపెనీ విషయంలో అర్హతగల భాగస్వామీ ముందస్తు ఆమోదం ప్రకారం భాగస్వాములలో ఎవరైనా.
d. ట్రస్ట్ విషయంలో ట్రస్ట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం ట్రస్టీలు లేదా లబ్ధిదారులలో ఎవరనా.
e. కార్పొరేట్ల విషయంలో కార్పొరేట్ ఆమోదించిన బోర్డు తీర్మానం ప్రకారం అర్హతగల వ్యక్తి ట్రేడింగ్ అకౌంట్ నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications