Stock Market: ఒడిదొడుకుల్లో మార్కెట్లు.. సూచీల ఫ్లాట్ ట్రేడింగ్..
Stock Market: నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రధానంగా మార్కెట్లలో దిశానిర్థేశం కోసం ఇన్వెస్టర్లు వచిచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 3 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1 పాయింట్ లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 3 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. అయితే మెుదటి ట్రేడింగ్ సెషన్లో సూచీలు మరింత నష్టాల్లో జారుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా కన్జూమర్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, ఐటీసీ, నెస్లే, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఆటో, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, యూపీఎల్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్స్ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications