పసిడి ముట్టుకుంటే భగ్గుమంటోంది. ధరలు చుక్కలను తాకి కిందకు దిగిరానంటున్నాయి. ఇప్పటికే లక్ష రూపాయలకు చేరువలో ఉంది బంగారం ధర.. అయితే తాజాగా బంగారంపై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరగనుంది. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 10 వేలకు చేరుకోనుందని నివేదిక తెలిపింది. ఈ రిపోర్టు చూసిన పసిడి ప్రియులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యధిక అమ్మకాల రికార్డు నెలకొల్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఎక్స్ వేదికగా మార్కెట్ల ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం రానున్న కాలంలో ప్రపంచ మార్కెట్లో అతి పెద్ద సంక్షోభం రాబోతుందన్నారు. నేను ఎవరినీ హెచ్చరించలేదని చెప్పకండి. నా పుస్తకం రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో ఊహించినట్లుగా చరిత్రలో అతిపెద్ద క్రాష్ రాబోతోంది. అయితే ఈ వేసవిలోనే క్రాష్ సమయం ఉంటుందని భయంగా ఉందని తెలిపారు.

స్టాక్, బాండ్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు లక్షలాది మంది నన్ను ఫాలో అయ్యే పెట్టుబడి దారులు లాస్ అవుతారు. అయితే వారికి నేను చెప్పేది ఒకటే..ఈ రోజు మార్కెట్లో అదిపెద్ద లాభాల బాటగా వెండి నిలవబోతోంది. కాబట్టి వెండి కొనుగోలు చేసిన వారు ధనవంతులు కావొచ్చు అని తెలిపారు. రానున్న వేసవిలో స్టాక్ మార్కెట్లతో పాటు రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా క్రాష్ అవుతాయని తెలిపారు. బిట్ కాయిన్ బిజినెస్ అయితే తారా స్థాయకి చేరుకుంటుందని జోస్యం చెప్పారు.ఇలాంటి సమయంలో బంగారం, వెండి మీద పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయని చెప్పుకొచ్చారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం వెండి ధర ఔన్సుకు దాదాపు 35 డాలర్లు ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా దాదాపు ప్రతి ఒక్కరూ వెండిని కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మీరు ధనవంతులు అవుతారా..లేక పేదవారిగానే మిగిలిపోతారా అని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక లోటుతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాండ్లపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, తీవ్రతరం అవుతున్న వాణిజ్య యుద్ధంపై కొనసాగుతున్న ఆందోళనలు - ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి బలమైన సాక్ష్యాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక EUపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికల వల్ల కూడా మార్కెట్లు ఇప్పటికీ కొంత అనిశ్చితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి దారులు తమ పెట్టుబడిలో కనీసం 10 శాతం బంగారం మీద పెట్టుబడి పెడితే లాంగ్ రేసులో వారు లాభాలను ఆర్జించవచ్చని కియోసాకి తెలిపారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. దీనికి ప్రధాన వైఫల్యంగా ఇటీవలి యూఎస్ బాండ్ వేలాన్ని ఎత్తి చూపారు. ఈ వైఫల్యమే ఆర్థిక సంక్షోభానికి నాంది పలికిందని అన్నారు. ఈ కారణలతోనే బంగారం ధర ప్రపంచ మార్కెట్లో 25 వేల డాలర్లకు చేరుకుంటుందని అలాగే వెండి రూ. 70 డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. ఇక మరోకటి బిట్ కాయిన్ అయితే ఏకంగా 5 లక్షల డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని హెచ్చరించారు. అధిక ద్రవ్యోల్బణంతో పాటుగా కుప్పకూలుతున్న బాండ్ల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర పరిణామాలపై కియోసాకి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications