Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 900 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ సమావేశానికి ముందు అప్రమత్తంగా కదలాడిన, నష్టాల్లోకి వెళ్లిన సూచీలు, నిన్న మాత్రం లాభాల్లోకి వచ్చాయి. అయితే నేడు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్భణంపై అమెరికా నివేదిక వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ముగిశాయి. దీంతో డౌజోన్స్, ఎస్ అండ్ పీ 2 శాతం నుండి 2.5 శాతం మేర క్షీణించాయి. నాస్ డాక్ కూడా 2.75 శాతం పతనమైంది.
సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.50 సమయానికి 920 పాయింట్లు క్షీణించి 54,400 వద్ద, నిఫ్టీ 250 పాయింట్లు తగ్గి 16,229 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్నటి లాభాలకు మించి నేడు ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. నేడు భారీగా నష్టపోవడంతో సెన్సెక్స్ ఏకంగా 54,500 దిగువకు పడిపోయింది. నిఫ్టీ కీలక 16,250 పాయింట్ల దిగువకు వచ్చింది.

అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే కదలాడుతున్నాయి. నిఫ్టీ ఐటీ అత్యధికంగా నష్టపోయిన రంగాల్లో ఉంది. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీమ్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా, HDFC, విప్రో ఉన్నాయి.


Click it and Unblock the Notifications