ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో,"రిచ్ డాడ్ పూర్ డాడ్" అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన ఆర్థిక నిపుణుడు, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి హెచ్చరిక గంటలు మోగించారు. 2008-09 ఆర్థిక సంక్షోభం వస్తుందని ముందే చెప్పిన ఆయన, త్వరలోనే మరోసారి పెద్ద స్టాక్ మార్కెట్ పతనం జరగొచ్చని చెబుతున్నారు. అందుకే పెట్టుబడిదారులు కేవలం షేర్లపైనే ఆధారపడకుండా, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులను కూడా సురక్షితంగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఆగస్టు 11, 2025న ఆయన సోషల్ మీడియా Xలో ఇలా రాశారు "స్టాక్ మార్కెట్‌లో పెద్ద పతనం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ఉన్నవారికి ఇది మంచి వార్త. కానీ 401k రిటైర్మెంట్ ప్లాన్స్ మీద ఆధారపడే బేబీ బూమర్స్‌కి ఇది చెడు వార్త" అని చేశారు. ఈ ఒక్క పోస్ట్‌తో ఇన్వెస్టర్లలో ఉత్కంఠ పెరిగింది.
ఎందుకు బంగారం, వెండి, బిట్‌కాయిన్?
రాబర్ట్ కియోసాకి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ముద్రించే ఫియాట్ కరెన్సీ (నోట్లు) పట్ల అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఆయన దృష్టిలో ఈ నోట్లకు నిజమైన విలువ ఉండదని, వాటి వెనుక కేవలం ప్రభుత్వ హామీ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అందుకే వాటిని తరచుగా "fake money" అని పిలుస్తుంటారు. డబ్బు ముద్రణ ఎక్కువైనప్పుడు దాని విలువ తగ్గిపోతుందని, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల సంపాదన క్రమంగా క్షీణిస్తుందని ఆయన అభిప్రాయం.
ఇక బంగారం, వెండి లాంటి ఆస్తులు శతాబ్దాలుగా తమ విలువను నిలబెట్టుకున్నాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రభుత్వ మార్పులు జరిగినా కూడా ఈ లోహాల ప్రాధాన్యం తగ్గలేదు. చరిత్రలో ఎన్నిసార్లు కరెన్సీలు విలువ కోల్పోయినా, బంగారం-వెండి మాత్రం ఎప్పటికప్పుడు సురక్షిత ఆస్తులుగా నిలిచాయి. అందుకే కియోసాకి ఇన్వెస్టర్లు తమ సంపదను కాపాడుకోవాలంటే ఇలాంటి విలువైన ఆస్తులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు డిజిటల్ యుగంలో కొత్త "సేఫ్ హేవెన్"గా ఆయన భావిస్తున్నారు. అందుకే ఇన్వెస్టర్లు వైవిధ్యమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి అని ఆయన పదే పదే చెబుతుంటారు.
గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ ధరల పెరుగుదల
బంగారం: గత ఏడాది బంగారం ధర గణనీయంగా పెరిగింది. దాదాపు 40% పెరుగుదలతో, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1 లక్షకు చేరుకుంది. ఈ పెరుగుదల వల్ల బంగారం మళ్లీ ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
వెండి: వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది లోనే సుమారు 44% పెరిగి, ఇప్పుడు కిలోకు దాదాపు రూ.1,16,000కు చేరుకుంది. ఈ పెరుగుదల కారణంగా వెండి కూడా బంగారంలాగే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఆస్తిగా మారింది.
బిట్‌కాయిన్: బిట్‌కాయిన్ ధర మాత్రం అతి పెద్ద జంప్ తీసుకుంది. గత ఏడాదిలోనే ఇది అద్భుతమైన 111% పెరుగుదల సాధించి, ఇప్పుడు ఒక్క బిట్‌కాయిన్ ధర ఆగస్టు 17, 2025 నాటికి దాదాపు $1,17,293 (కోటికి పైగా) చేరుకుంది. ఈ పెరుగుదలతో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై పెట్టుబడిదారుల దృష్టి మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కియోసాకి చెప్పింది ఉట్టి మాట కాదని చాలామంది భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎందుకు?
ప్రస్తుతం అమెరికా మార్కెట్లు గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి, ఆర్థిక వృద్ధి వేగం తగ్గిపోతోంది, అలాగే అమెరికా ప్రభుత్వ అప్పులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం రిటైర్మెంట్ ఫండ్‌లు ముఖ్యంగా 401k వంటి ప్లాన్లు పెద్ద ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి ఆర్థిక అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు సంప్రదాయ రిటైర్మెంట్ పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడటం చాలా రిస్క్ అని ఆయన హెచ్చరిస్తున్నారు.
కియోసాకి చాలా ఏళ్ల క్రితమే బిట్‌కాయిన్ కొనడం ప్రారంభించారు. $6,000 ధర ఉన్నప్పుడు కొనడం మొదలుపెట్టి, "నా దగ్గర ఇంకో fake money ఉంటే మరిన్ని బిట్‌కాయిన్‌లు కొనేవాడిని" అని సరదాగా అన్నారు. అతను భవిష్యత్తులో బిట్‌కాయిన్ ధర 2030 నాటికి $1 మిలియన్ వరకు వెళ్తుందని అంటున్నారు.
రాబర్ట్ కియోసాకి ప్రధానంగా చెప్పే సందేశం ఏమిటంటే ప్రస్తుత కరెన్సీ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు. డబ్బు విలువ తగ్గే అవకాశం ఎప్పుడూ ఉంటుందని, అందుకే ఇన్వెస్టర్లు తమ డబ్బును కేవలం కరెన్సీ లేదా స్టాక్ మార్కెట్‌లో కాకుండా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌పై అధికంగా ఆధారపడటం కన్నా, నిజమైన విలువను నిలుపుకునే ఈ రకమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం భవిష్యత్‌లో భద్రతను ఇస్తుందని ఆయన అభిప్రాయం.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications