Stock Market Closing Bell: ప్రపంచ వృద్ధి ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో ఈరోజు ఈక్విటీ, కమోడిటీలు పడిపోయాయి. వారం ప్రారంభంలోనే వీక్లీ ఎక్స్ పైరీ కూడా కొంత మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఇదే సమయంలో భారత Q1FY23 జీడీపీ అంచనాలను చేరుకోకపోవటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఆగస్ట్‌లో తయారీ రంగం పనితీరు తగ్గుదల కూడా ఆందోళనకు కారణంగా నిలిచింది.

రిలయన్స్ షేర్ల పతనం..
ఉదయం ఆరంభంలోనే మార్కెట్లు నష్టాలతో ఆరంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెనెక్స్ సూచీ ఏకంగా 770 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమంయలో నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ కారణంగా సెన్సెక్స్ సూచీ దాదాపు 30 శాతం నష్టపోవటానికి కారణమైంది.

నష్టపోయిన స్టాక్స్..
ఈ రోజు మార్కెట్లలో ప్రధానంగా.. TCS, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, HUL, ఇన్ఫోసిస్, NTPC, HDFC, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ICICI బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ షేర్లన్నీ ఒక్కొక్కటి 1.5 శాతానికి పైగా పడిపోయాయి. దాదాపుగా అనేక టెక్ కంపెనీలు మార్కెట్ ట్రేడింగ్ సమయంలో నష్టాలను చవిచూశాయి.

ఇతర సూచీల పరిస్థితి..
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ బ్యాంక్ సూచీ 235 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం స్పల్పంగా లాభపడి 34 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ రియాల్టీ సూచీ 1 శాతం, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.9 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.12 శాతం క్షీణించాయి.

గ్లోబల్ కారణాలు..
అధిక వడ్డీ రేట్లు, దూసుకుపోతున్న ఆర్థిక మాంద్యం భయాల కారణంగా యూరోపియన్, అమెరికా మార్కెట్లు సైతం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు మాత్రం భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు నాలుగు నెలల కనిష్ఠాలకు చేరుకున్నాయి.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications