స్టాక్ మార్కెట్‌లో ఐపీఎల్ జోష్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. 5నెలల నష్టాలకు చెక్..

నేడు స్టాక్ మార్కెట్ 5 నెలల ఒత్తిడి నుండి బయటపడిందనడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఇవాళ మార్చి 24న షేర్ మార్కెట్ ఉదయం మంచి జోష్ తో ప్రారంభమై, రోజు గడిచేకొద్దీ బలపడుతూనే ఉంది. దింతో సాయంత్రం షేర్ మార్కెట్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 1128.69 పాయింట్లు పెరిగి 78,034.2 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 307.95 పాయింట్లు పెరిగి 23,658.35 వద్ద ముగిశాయి.

Stock Market closed today in profits Sensex batted 1100 points Nifty closed at 23 658 35

నేటి ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాలు బలమైన ట్రెండ్ చూపించాయి. స్టాక్ మార్కెట్ లాభలతో ముగిసిన వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు నేడు. దీనికి ముందు షేర్ మార్కెట్ నిరంతర హెచ్చుతగ్గులను ఎదురుకొంది. ఈ దెబ్బకి పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో వాల్యూ నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ వేగంగా పుంజుకోవడంతో పెట్టుబడిదారుల ముఖాల్లో రిలీఫ్ కనిపిస్తోంది. నిరంతర పెరుగుదలతో BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. సెన్సెక్స్‌లోని టాప్ 10 కంపెనీలలో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.06 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

ఈరోజు BSEలో లిస్టయిన కంపెనీలలో కోటక్ బ్యాంక్ షేర్లలో అతిపెద్ద పెరుగుదల కనిపించింది. దీని తరువాత NTPC, SBI, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నాయి. బజాజ్ అలియాంజ్‌ సంబంధిత వార్తలు వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు బలపడటం ఇదే మొదటిసారి. మరోవైపు నష్టాలను చుసిన స్టాక్‌ల గురించి మాట్లాడుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, భారతి ఎయిర్‌టెల్, మహీంద్రా, జొమాటో ఇంకా టైటాన్ పేర్లు ఉన్నాయి.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIలు) అమ్మకాలు తగ్గడం భారత మార్కెట్‌కు శుభ సంకేతం అని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుండి నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు, కానీ ఇప్పుడు వారి వ్యూహం మారిపోయింది. మార్చి 21న ఎఫ్‌ఐఐలు రూ.3,255 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.31,718 కోట్లు ఉపసంహరించుకున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుండి డబ్బును ఉపసంహరించుకుని చైనాలో పెట్టుబడి పెడుతున్నారు. చైనాలో పెద్ద తిరోగమనం గురించి హెచ్చరిక ఉంది అండ్ భారత స్టాక్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. దింతో ఎఫ్‌ఐఐలు భారతదేశ వైపు తిరిగి వస్తున్నారు.

ఏప్రిల్ 2 షేర్ మార్కెట్ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ట్రంప్ సుంకాలు అదే రోజు నుండి అమలు కానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కూడా ట్రంప్ సుంకాల పై ప్రకటించినప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధం తలెత్తవచ్చని భయాలు మొదలయ్యాయి దింతో ఈక్విటీ మార్కెట్లు బలహీనపడ్డాయి. అమెరికన్ మార్కెట్ కూడా క్షీణత ఎదుర్కోవలసి వచ్చింది. ఒక విధంగా పరస్పర సుంకం అంటే 'టిట్ ఫర్ టాట్' అని అర్థం. దీని అర్థం అమెరికా ఉత్పత్తులపై విధించే సుంకాన్నే ఇతర దేశాల ఉతప్తుల పై కూడా అమెరికా సుంకాన్నీ విధిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+