Rakesh Jhunjhunwala: బీఎస్ఈలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. జూన్ 17, 2022 శుక్రవారం నాడు ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్‌వాలా టెక్నాలజీ కంపెనీలో 57.5 లక్షల ఈక్విటీ షేర్‌లను అమ్మేశారు. ఒక్కో షేరును దాదాపు రూ. 167.17 చొప్పున డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా రాకేశ్ జున్‌జున్‌వాలా సపోర్ట్ చేసిన గేమింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ డెల్టా కార్ప్ షేర్లు ఈ రోజు ఇంట్రాడేలో దాదాపు 10 శాతం మేర క్షీణించాయి. అయితే ఇంత భారీ మెుత్తంలో జరిగిన డీల్ కు సంబంధించిన వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.
వాటాను తగ్గించుకున్న జున్‌జున్‌వాలా కుటుంబం:
గతంలో జూన్ 1-14 మధ్య కాలంలో రాకేశ్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా డెల్టా కార్ప్‌కి చెందిన దాదాపు 75 లక్షల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ సేల్ చేశారు. ఈ లావాదేవీల తర్వాత.. డెల్టా కార్ప్‌లో జున్‌జున్‌వాలా కుటుంబ వాటా మే 31నాటికి 6.17 శాతం నుంచి 3.36 శాతానికి తగ్గింది. అంతకు ముందు మార్చి క్వార్టర్ చివరి నాటికి జున్‌జున్‌వాలా, అతని భార్య కలిసి డెల్టా కార్ప్‌లో 7.48 శాతం వాటాను కలిగి ఉన్నారు.

తొలిసారిగా 12 శాతం పెరిగిన షేర్:
ఇదే క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ జూన్ 10 నాటికి తన స్కీమ్లలో డెల్టా కార్ప్‌లో వాటాను 2.15 శాతం మేర పెంచాయి. దీంతో మెుత్తం డెల్టా కార్ప్‌లో అన్ని స్కీముల కింద కలిపి ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 9.21 శాతం షేర్లను కలిగి ఉంది. గత నెలలో ఈ స్టాక్ దాదాపు 28 శాతం పడిపోయింది. డెల్టాటెక్ గేమింగ్ పబ్లిక్ ఆఫర్ కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్న తరువాత ఈ కంపెనీ షేర్లు శుక్రవారం 12 శాతం మేర లాభపడ్డాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications