స్టాక్ మార్కెట్ గతవారం భారీ నష్టాల్లో ముగిసింది. ఈ వారం కూడా ఊగిసలాట కొనసాగవచ్చునని భావిస్తున్నారు. సెన్సెక్స్ గతవారం 55,000 పాయింట్లకు దిగువన ముగిసింది. నిఫ్టీ 16,450 పాయింట్ల దిగువన క్లోజ్ అయింది. ఐటీ షేర్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ బలహీనతలు కొనసాగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా క్షీణించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వడ్డీ రేటు పెంపు వైపు
భారత్, అమెరికా సహా అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు చర్యలు ప్రారంభించాయి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టడానికి ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి కాస్త పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఏప్రిల్ హోల్ సేల్ ద్రవ్యోల్భణం, వాహన విక్రయాల అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. దేశీయంగా ఆర్థిక ఫలితాల పైన, అంతర్జాతీయంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరలు, డాలర్ వ్యాల్యూ, ద్రవ్యోల్భణం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.

సెన్సెక్స్, నిఫ్టీ
క్రితం వారం సెన్సెక్స్ చివరి సెషన్‌లో 866 పాయింట్లు క్షీణించి 54,835 పాయింట్ల వద్ద ముగిసింది. 55,000 పాయింట్ల దిగువన ముగిసిన సెన్సెక్స్, ఈ వారం 53,000 నుండి 54,000 పాయింట్ల మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు. సెన్సెక్స్ గతవారం కీలక మద్దతు 56000 పాయింట్ల దిగువకు చేరుకుంది. స్వల్పకాలంలో 53,000 పాయింట్ల నుండి 54000 పాయింట్ల శ్రేణిలో కదలాడవచ్చునని, మరోవైపు 56,500 నుండి 57,300 పాయింట్ల శ్రేణిలో నిరోధకం ఉండవచ్చునని చెబుతున్నారు.

బంగారం ధరలు
బంగారం ధరలు ఈ వారం ఊగిసలాటలో లేదా క్షీణతను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,690, రూ.50,375 టార్గెట్‌తో రూ.50,907 దిగువన షార్ట్ సేల్ చేయవచ్చునని చెబుతున్నారు. రూ.51,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. గోల్డ్ ఫ్యూచర్స్ పెరిగితే రూ.51,800 వద్ద నిరోధకం ఉండవచ్చునని, ఆ తర్వాత రూ.52,000 క్రాస్ చేయవచ్చునని అంటున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,600 వద్ద మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయి దిగువకు వస్తే రూ.61,000 దిగువకు పడిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications