Multibagger stock: ఎంతోమంది స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిద్దామని పెట్టుబడి పెడుతుంటారు. అయితే అందరికీ అది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం మంచి రిటర్న్ పొందుతున్నట్లు చారిత్రక డేటాను చూస్తే అర్థమవుతుంది. లార్జ్ క్యాప్ మాత్రమే కాకుండా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టిన పెట్టుబడిని ఊహించని ఓ రేంజ్ లో పెంచిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ గురించి చూద్దాం.
7 రూపాయలతో ప్రారంభమైన స్టాక్ బహుశా ఎంతవరకు పెరగవచ్చు. సాధారణంగా 100 శాతం లేదగా 1000 శాతం రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు అని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మ్యాజెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఏకంగా 8 వేలకు పైగా శాతాన్ని రిటర్న్స్ ఇచ్చి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 నుంచి దాని జైత్రయాత్ర మొదలుకాగా.. గత 3 ఏళ్లలోనే 4 వేల శాతం బంపర్ రాబడి అందించింది.

మూడేళ్ల కిందట లక్ష ఇన్వెస్ట్ చేస్తే 41 లక్షలు చేతికి ఇచ్చింది. ఇక ఐదేళ్ల కింద పెట్టిన వాళ్లకు అయితే ఏకంగా 82 లక్షలు భారీ రిటర్న్ తెచ్చి పెట్టింది. గత ఏడాదిగా చూసినా 180 శాతం బంపర్ రాబడిని పండించింది. 6 నెలల్లోనే 35 శాతం పెరిగింది. షార్ట్ టర్మ్ కంటే లాంగ్ లో కళ్లు చెదిరే లాభాలతో పిచ్చెక్కించింది. ఇప్పటికీ పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి హాట్ స్టాక్‌గా మారింది.
ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి 672 కాగా 65 రూపాయలు తక్కువకు ట్రేడ్ అవుతోంది. 52 వారాల కనిష్ఠ స్థాయి 203గా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ స్టాక్ మరిన్ని వండర్స్ సృష్టించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు పండగ చేసుకుంటున్నారు. చేయనివారు ఇలాంటిది ఇంకొకటి దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications