Zomato Profits: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై అందరి దృష్టి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటోపై అందరి దృష్టి కొనసాగుతోంది. ప్రధానంగా బ్లింకిట్ క్విక్ కామర్స్ రంగంలో పెద్ద ఆటగాడిగా దూసుకుపోతూ కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళుతోంది. అయితే నేడు మార్కెట్ల ప్రారంభంలో జొమాటో స్టాక్ ధర 3 శాతం మేర క్షీణతను చూసింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 389 శాతం పెరిగి రూ.176 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 68.5 శాతం పెరుగుదలతో రూ.4799 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ బోర్డు క్యూఐపీల ద్వారా రూ.8500 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి కంపెనీ క్విక్ కామర్స్ నష్టాలు, ఇతర వ్యూహాత్మక పెట్టుబడుల కారణంగా క్యాష్ రిజర్వ్స్ భారీగా క్షీణించటంతో మూలధన అవసరాల కోసం ఈ మెుత్తాన్ని సమీకరిస్తు్నారు. అయితే ప్రస్తుతం కంపెనీ గతంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు ప్రస్తుతం రాబడిని అందిస్తుండటంతో నిధులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించినట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.

తాజా త్రైమాసిక ఫలితాల్లోని వివరాల ప్రకారం కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మెుదటి త్రైమాసికంలో రూ.2014 కోట్ల నుంచి రూ.1726 కోట్లకు తగ్గటం గమనించబడింది. అయితే పేటీఎంకు చెందిన టికెటింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చెల్లింపుల కారణంగా ఈ తగ్గింపు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో కంపెనీకి చెందిన క్విక్ కామర్స్ వెంచర్ బ్లింకిట్ వేగంగా దూసుకుపోతోంది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ తన డార్క్ స్టోర్ల సంఖ్యను రెండింతలు చేసింది. ఇదే క్రమంలో గ్రాస్ ఆర్డర్ వ్యాల్యూ సైతం భారీగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
బ్లింకిట్ వ్యాపారాన్ని పరిశీలిస్తే చెన్నై, హైదరాబాద్ మినహా ఇతర మెట్రో నగరాల్లో అగ్రగామి ఆటగాడిగా కొనసాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంపై అధికంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న నగరాల్లో తక్కువ అవకాశాల కంటే టాప్ 8 నగరాల్లో ఫోకస్ ముఖ్యంగా కంపెనీ భావిస్తోంది. 2026 చివరి నాటికి మెుత్తం దేశంలో డార్క్ స్టోర్ల సంఖ్యను 2000కు పెంచాలని కంపెనీ ప్లాన్ చ్సేతోంది. అయితే ప్రస్తుతం కంపెనీకి 791 స్టోర్లు ఉన్నట్లు వెల్లడైంది.
10 నిమిషాల్లో డెలివరీ ఆటలో ఎవడు పోటుగాడు అనే విషయాన్ని పరిశీలిస్తే.. బ్రోకరేజ్ సీఎల్ఎస్ఏ ప్రకారం.. క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్ 39% మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. జెప్టో అండ్ ఇన్ స్టామార్ట్ ఒక్కొక్కటి 28% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నాయి. ఇక టాటా బిగ్ బాస్కెట్ BB Now, Flipkart Minutes కలిసి 10 నిమిషాల డెలివరీ మార్కెట్‌లో 6% వాటాను కలిగి ఉన్నాయి.
బ్రోకరేజ్ కాల్స్..
- HSBC కొనుగోలు రేటింగ్ ఇస్తూ టార్గెట్ ధర రూ.330గా నిర్ణయించింది
- నోమురా జొమాటో షేర్లకు రూ.320 టార్గెట్ ధరగా పేర్కొంది
- మోతీలాల్ ఓస్వాల్ స్టేబుల్ రేటింగ్ అందించింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications