working hours: పనిగంటలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కంపెనీల అధినేతలు, ఆయా సంస్థల CEOలు తమదైన శైలిలో స్పందించారు. అయితే ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ మాత్రం వాటికి కాస్త భిన్నంగా ప్రవర్తించి షాక్ ఇచ్చింది.
దేశంలో పేరుమోసిన ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్త పాలసీని రూపొందించింది. ఉద్యోగులు వారి షిప్ట్ టైమ్ 8-8.5 గంటలు దాటిన తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ పనిచేయడానికి వీలులేదని పేర్కొంది. సిబ్బంది ఆరోగ్యం, ఉత్పాదకతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

కేవలం పాలసీ ప్రవేశపెట్టడంతోనే సరిపెట్టలేదని గ్రూప్ చీఫ్ HR నిరేన్ శ్రీవాస్తవ తెలిపారు. దీనిని పాటించేందుకు ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్దేశిత సమయానికి 45 నిమియాల గ్రేస్ పీరియడ్ అనంతరం ఇ-మెయిల్స్ పనిచేయకుండా సర్వర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. షిఫ్ట్ కు మించి ఆఫీసులో ఎవరూ ఉండకుండా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు.
కొత్త పాలసీపై గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO మోతీలాల్ ఓస్వాల్ స్పందించారు. పని గంటల సంఖ్య ముఖ్యం కాదని.. ఉద్యోగుల మనశ్శాంతి, సంతృప్తి, శ్రేయస్సు మరియు ఉత్పాదకతను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ కొత్త విధానం వల్ల సిబ్బంది తమ ఆరోగ్యం, కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే స్వేచ్ఛ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications