Tax Filing: ప్రస్తుతం దేశంలో చాలా మంది టాక్స్ చెల్లింపుదారులు ఆందోళనలో ఉన్నారు. గడువులోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ రిఫండ్ ప్రాసెస్ కాకపోవటంతో గందరగోళానికి గురవుతున్నారు.
సమయానికి అన్ని పూర్తి చేసినా బ్యాంక్ ఖాతాలోకి రిఫండ్ రావాల్సిన సొమ్ము రాకపోవటంతో చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ITRలో పేర్కొన్న బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావటం లేదా అనేక ఇతర కారణాల వల్ల రీఫండ్ పొందటం లేటుకావొచ్చు. సాధారణంగా చేసే తప్పులను గమనిస్తే.. మీరు పన్ను రిటర్న్‌ను ధృవీకరించనట్లయితే.. ఎలాంటి వాపసు రాదు. ఎందుకంటే రిటర్న్‌ని వెరిఫై చేస్తే తప్ప ITR ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కాదు.

అలాగే ఫారమ్ 26AS, AISలో నమోదు చేయబడిన మొత్తం లావాదేవీలు, ఆదాయం, చెల్లించిన పన్ను, మినహాయింపులు, మదింపు సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు చేసిన వాపసు క్లెయిమ్‌లు పరిశీలించబడతాయి. పన్ను చెల్లింపుదారుల ఐటీఆర్ పత్రాలకు AIS పత్రాల్లోని వివరాలకు మధ్య తేడాలు ఉన్నట్లయితే టాక్స్ రిఫండ్ నిలిచిపోతుంది. ఇలాంటి పెండింగ్ కేసుల్లో రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పన్నులు ఏవైనా పెండింగ్‌లో ఉంటే రీఫండ్ ప్రాసెసింగ్ నిలిచిపోతుంది.
పన్ను చెల్లింపుదారు తక్కువ పన్ను చెల్లించి ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ అతనికి పూర్తి టాక్స్ చెల్లింపు చేయమని నోటీసు పంపుతుంది. సవరించిన ఐటీఆర్‌ను పూరించడానికి సూచనలను కూడా ఇస్తుంది. దీని తర్వాత మాత్రమే పన్ను చెల్లింపుదారు వాపసు పొందడానికి అర్హులు. అలాగే క్లెయిమ్‌కు మద్దతుగా మీరు మరిన్ని డాక్యుమెంట్‌లను సమర్పించాలని పన్ను అధికారులకు అవసరమైతే, రీఫండ్ ఆలస్యం అవుతుంది. సంబంధిత పత్రాలను సమర్పించి ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే డబ్బు బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications