MultiBagger Stock: రూ. లక్షను రూ.5 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. అదీ ఆరు నెలల్లోనే..!

స్టాక్ మార్కెట్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి. వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తయారీ సంస్థ స్టెర్లైట్ టెక్నాలజీస్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తోంది. అనిల్ అగర్వాల్‌కు చెందిన ఈ కంపెనీ 6 నెలల్లో బలమైన మంచి రిటర్న్స్ అందించింది. గత ఆరు నెలల్లో 550 శాతానికి పైగా లాభాన్ని అందించింది. గత ఆరు నెలలుగా దీని షేర్లు అద్భుతమైన రాణించాయి. అయితే గత ఐదు రోజుల్లో వీటి విలువ సుమారు 5 శాతం మేర పడిపోయింది. ఆరు నెలల క్రితం అంటే 2026 జనవరి 5న స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లు రూ.102.8 వద్ద ఉండేవి. 2026 జూలై 6 నాటికి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లు రూ.585 కు పెరిగాయి.

స్టెర్లైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL) టెలికాం విభాగం డీమెర్జ్ తర్వాత జూలై 2001లో స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏర్పడింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఒక గ్లోబల్ డిజిటల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేటర్ గా పని చేస్తోంది. ఇది 5G, ఫైబర్-టు-ది-హోమ్ (FTTH), గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి అవసరమైన ఆప్టికల్ ఫైబర్, ప్రత్యేక కేబుల్స్ తయారు చేస్తోంది. అంతేకాకుండా AI-సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ కనెక్టివిటీ వంటి భౌతిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను డిజైన్ చేసి తయారు కూడా చేస్తోంది.

Multi Bagger

ఆరు నెలల్లోనే ఈ స్టాక్ భారీ లాభాలను అందించింది. ఒక వేళ మీరు ఆరు నెలల క్రితం ఈ కంపెనీలో రూ. లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ రూ. 5 లక్షలకు పైగా పెరిగేది. కాగా తాజాగా కంపెనీ నిధులు సమీకరించే ప్రయత్నంలో భాగంగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP)ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే జూన్ 25న స్టాక్ అప్పర్ సర్క్యూట్ ను తాకింది. అయితే తర్వాత పడిపోయింది. మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనల ప్రకారం, ధరల సూత్రం ఆధారంగా స్టెర్లైట్ టెక్ QIP ఇష్యూను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.613.69 ఫ్లోర్ ధరగా నిర్ణయించింది.

రాబోయే డేటా సెంటర్ మౌలిక సదుపాయాల సైకిల్స్ కు ముందు, కొత్త పెట్టుబడి సహాయంతో కంపెనీని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే నిధులను సేకరించింది. స్టెర్లైట్ టెక్నాలజీ షేర్లు గత ఐదేళ్లలో పెట్టుబడిదారులకు 120% కంటే ఎక్కువ లాభాన్ని అందించగా.. గత మూడేళ్లలో 294% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఇక సంవత్సరం కాలంగా 483% కంటే ఎక్కువ లాభాన్ని అందించింది. జూన్ 5, 2026న కంపెనీ షేర్లు రూ.679.90 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరగా, జనవరి 27, 2026న ₹84.60 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+