For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టీల్ ధర హై: కస్టమ్ డ్యూటీ తగ్గించడమే కారణమా..?

|

స్టీల్‌‌‌‌ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. టన్నుకు రూ.నాలుగు వేల ధర మేర పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే హాట్‌‌‌‌ రోల్డ్‌‌‌‌ కాయిల్‌‌‌‌ రేట్లు ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్‌లో పెరగడమే ఇందుకు కారణమనిపేర్కొన్నాయి. రేట్ల పెరుగుదలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. టన్నుకు రూ.4 వేల వరకు పెంచాలని మెజారిటీ కంపెనీలు అనుకుంటున్నాయని స్టీల్‌‌‌‌ కంపెనీ సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఒకరు చెప్పారు.

మార్చిలో స్టీల్‌‌‌‌ మిల్స్‌‌‌‌ రేట్లను టన్నుకు రూ.వెయ్యి చొప్పున తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌‌‌‌ దిగుమతులపై కస్టమ్‌‌‌‌ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణమని తెలిపారు. సెమీస్‌‌‌‌, ఫ్లాట్‌‌‌‌, నాన్‌‌‌‌ అలాయ్‌‌‌‌, అలాయ్‌‌‌‌, స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్‌‌‌‌ రకాలపై కస్టమ్ డ్యూటీ తగ్గిందన్నారు. చైనాలో పండగ సమయం కాబట్టి ధరలు కూడా తక్కువ ఉండేవని స్టీల్‌‌‌‌ కంపెనీలు తెలిపాయి.

steel rates are high

చైనాతోపాటు ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్లలో హాట్‌‌‌‌ రోల్డ్‌‌‌‌ కాయిల్‌‌‌‌ రేట్లు పెరిగాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం హాట్‌‌‌‌ రోల్డ్‌‌‌‌ కాయిల్‌‌‌‌ టన్ను రేటు రూ.56 వేల వరకు ఉండగా, దీనిని రూ.60 వేల వరకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌‌‌‌ వీటి ధరలు రూ.35 వేలు-45 వేల మధ్య ఉండేవని డీలర్లు తెలిపారు.

స్టీలు ఎగుమతి, దిగుమతుల ధరల మధ్య టన్నుకు దాదాపు 15 వేల తేడా ఉందని, ఈ తేడాను తగ్గించాలని, టన్నుకు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు పెంచక తప్పకపోవచ్చని ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌‌‌‌ మినరల్‌‌‌‌ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ టన్ను ఓర్‌‌‌‌ ధరను రూ.5,350 వరకు పెంచింది.

Read more about: steel rate high
English summary

స్టీల్ ధర హై: కస్టమ్ డ్యూటీ తగ్గించడమే కారణమా..? | steel rates are high

steel rates are high. all companies steel rates are increased.
Story first published: Saturday, March 27, 2021, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X