Steel Price: దేశంలో పండుగల సీజన్ రావటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. పండుగకి కొత్త కారు, ఇల్లు ఇలా అనేక వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ సందర్భంలో సొంతిల్లు కట్టుకోవాలని భావిస్తున్న వారికి పెద్ద ఊరటనిచ్చే వార్త ఇది. గడచిన ఆరు నెలలుగా స్టీల్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇది నిర్మాణ ఖర్చులను తగ్గించుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది.

40% కిందకు..
గడచిన ఆరు నెలల కాలంలో స్టీల్ ధర ఊహించని స్థాయిలో తగ్గినట్లు స్టీల్‌మింట్ వెల్లడించింది. ఈ క్రమంలో స్టీల్ ధర 40 శాతం పతనం తర్వాత ప్రస్తుతం రూ.57,000 స్థాయిలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం వల్ల మందగించిన రియల్టీ రంగంలో ధరల తరుగుదల కొత్త జోష్ నింపుతోంది. ఖరీదు తగ్గించుకుని.. వేగంగా నిర్మాణాలను చేసేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు.

టన్ను ధర రూ.93,000 నుంచి..
ఏప్రిల్-2022 ప్రారంభంలో స్టీల్ ధర టన్నుకు రూ.78,800గా ఉంది. దీనిపై 18 శాతం జీఎస్టీని కలుపుకుంటే ఆ ధర రూ.93,000కు చేరుకుంది. ఈ ఏడాది ఇదే ఆల్ టైం హై రేటు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన స్టీల్ జూన్ చివరి నాటికి టన్ను ధర రూ.60,200కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ధర మరింత తగ్గి టన్ను రూ.52,000 వద్దకు వచ్చింది.

ఎగుమతులపై టాక్స్..
మే 21న కేంద్ర ప్రభుత్వం ఐరన్ ఓర్ ఎగుమతులపై 50 శాతం, ఇతర స్టీల్ ఉత్పత్తులపై 15 శాతం టాక్స్ విధించింది. అలాగే స్టీల్ పరిశ్రమలో ఉపయోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్ దిగుమతులపై కూడా సుంకం విధించింది. దేశంలో సరఫరా పెంచి ధరలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19, 2022న తెలంగాణలోని హైదరాబాద్ లో టన్ను స్టీల్ ధర రూ.56,500గా ఉంది.

చీకటి సంకేతం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు వినియోగం భారీగా తగ్గిపోవటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో చీకచి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చైనా, యూరప్ ఆర్థిక వ్యవస్థల్లో నెమ్మదించటం వల్ల స్టీల్ డిమాండ్ తగ్గుతుందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తెలిపింది. 2022లో ఇది 2.3 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో చైనా ఉక్కు వినియోగం 4 శాతం తగ్గుతుందని నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాది రష్యా ఉక్కు వినియోగం 10 శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

దివాళా దిశగా చైనా..
చైనాలో ఉక్కు తయారుచేసే అనేక కంపెనీలు భారీ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరుగిన ఇంధన వ్యయాలు, పడిపోతున్న స్టీల్ ధరలు తయారీదారులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు దివాళాకు చాలా దగ్గరగా ఉన్నాయనే నివేదికలు చెబుతున్నాయి. చైనా కంపెనీలు వందల బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోవటం ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications