ArcelorMittal: స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆర్సెలర్ మిట్టల్ చైర్‌పర్సన్ లక్ష్మీ మిట్టల్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మింట్ వేదికగా అతిపెద్ద ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం ఏర్పాటుపై కామెంట్ చేశారు.
కంపెనీ గుజరాత్ హజీరాలో ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ తయారీ కేంద్రాన్ని 2029 నాటికి నిర్మిస్తుందని ప్రకటించారు. ఉక్కు తయారీ మొదటి దశ 2026 నాటికి పూర్తవుతుందని, రెండవ దశ అవగాహన ఒప్పందం(MOU) ద్వారా గుర్తించబడినది అన్నారు. రెండవ దశ 2029 నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

హజీరాలో ఏర్పాటవుతున్న కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సైట్‌గా మారిందన్నారు. ఈ విస్తరణ కార్యక్రమాన్ని 2021లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2022లో ఆర్సెలర్ మిట్టల్ ఆర్మ్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ దేశం స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 15 MTకి పెంచడానికి సుమారు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్కు తయారీలో నూతన సాంకేతికత, కొత్త యుగం యంత్రాలను ఏర్పాటు చేయటం ద్వారా ఉత్పత్తిని పెంచటం దీని లక్ష్యంగా ఉంది.
హజీరాలో ఉక్కు తయారీ ప్రదేశాన్ని విస్తరించడం పారిశ్రామిక వృద్ధికి భారత నిబద్ధతకు అనుగుణంగా ఉందని అన్నారు. ఉక్కు మాత్రమే కాక పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కూడా కార్పొరేషన్ పెట్టుబడులు పెడుతుందని ఆర్సెలర్ మిట్టల్ చైర్‌పర్సన్ చెప్పారు. తాను వైబ్రెంట్ గుజరాత్ కోసం గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఇక్కడికి వచ్చానన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications