Budget Updates on Dailyhunt: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో కొత్త రికార్డు నెలకొల్పటానికి సిద్ధమౌతున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 3.0 ప్రభుత్వంలో రెండవసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అలాగే వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి అత్యధిక వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనతను సాధించనున్నారు. దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఈసారి వార్షిక బడ్జెట్లో క్యాపెక్స్ లక్ష్యాన్ని పెంచటంతో పాటు ప్రభుత్వం ఆర్థిక లోటును తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే PLI స్కీమ్ ద్వారా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఉద్యోగ సృష్టి, ప్రయోజనాలు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను రాయితీలతో పాటు మినహాయింపులు ప్రకటిస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణంతో పాటు ప్రపంచ అస్థిరతల నుంచి వేతన జీవులకు ఉపశమనం కలిగిస్తుందని, అలాగే ప్రజల వద్ద ఖర్చు చేసేందుకు అధిక సంపదను మిగులుస్తుందని వారు భావిస్తున్నారు.

2017 నుంచి ఆర్థిక మంత్రి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఏటా ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగిసే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మునుపే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరి చేసింది. బడ్జెట్లో సాధారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు క్యాపెక్స్ ఖర్చులు ఉంటాయి. ఈ క్రమంలో వివిధ రంగాలకు కేటాయింపులను ఆదాయాలు, అవసరాలకు అనుగుణంగా చేస్తుంటారు.
వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన, సమతుల్య వృద్ధిని నిర్ధారించడానికి బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. ఇది దేశంలోని వివిధ వనరులను సమర్థవంతంగా కేటాయించడం, ప్రజలకు ఉపాధి అవకాశాలను పెంచటంతో పాటు పేదరిక స్థాయిలను తగ్గించడంపై దృష్టి పెడుతుంది. దేశంలోని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటం కూడా దీనిలో భాగంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
బడ్జెట్ 2025 ప్రసంగంలో ఆర్థిక మంత్రి కేటాయింపులు, వాటి ప్రభావాలకు సంబంధించిన వేగవంతమైన సమాచారాన్ని డైలీహంట్ యాప్ ద్వారా తెలుసుకోండి. బడ్జెట్ పై కీలకమైన అంశాలతో పాటు లైవ్ అప్‌డేట్స్ అందించటానికి డైలీహంట్ ఈ సంవత్సరం కూడా సంసిద్ధంగా ఉంది. ఇక బడ్జెట్ సమాచారం ఎప్పటికప్పుడు మీచేతుల్లో లభిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications