సమ్మర్లో కూల్‌గా ఉండాలా ? ఏసీ అక్కర్లేదు! ఈ సింపుల్ సీక్రెట్స్ మీకోసమే!
సమ్మర్ సీజన్ వచ్చేసింది ! ఎండలు మండే కొద్దీ చాలా మందికి గుర్తొచ్చేది ఎయిర్ కండీషనర్ (air conditioner). కానీ ఏసీ వాడటం వల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా, పర్యావరణానికి కూడా అంత మంచిది కాదు. కానీ ఏసీ లేకుండానే మీ ఇంటిని, మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ అండ్ తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గాలు ఉన్నాయి. మీరు తెలివిగా వెంటిలేషన్ టెక్నిక్స్ నుండి కూలింగ్ హ్యాక్స్ వరకు ఈ టిప్స్ మీకు న్యాచురల్ కూలింగ్ ఇస్తాయి. కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనుకున్నా, ఏసీకి అల్టార్నేటివ్ కోసం వెతుకుతున్నా వారికీ ఈ సింపుల్ సొల్యూషన్స్ ఈ సమ్మర్ వేడి నుండి మంచి రిలీఫ్ ఇస్తాయి.

1. ఫ్యాన్‌ను తెలివిగా వాడండి: కిటికీ దగ్గర ఫ్యాన్ పెట్టి బయటి చల్లని గాలిని లోపలికి వచ్చేలా చుడండి. రాత్రిపూట ఫ్యాన్‌ను కిటికీ వైపు బయటికి తిప్పి ఇంట్లో వేడిని బయటకు పంపండి. ఇలా చేయడం వల్ల సీలింగ్ ఫ్యాన్స్ కంటే గదిలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
2. సూర్యుడి వేడికి బ్రేక్ వేయండి: పగటిపూట కర్టెన్లు, గ్లాస్ విండోస్ లేదా వుడెన్ మ్యాట్స్/ బ్లయిండ్స్ వేయడం వల్ల సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. లైట్ కలర్ కర్టెన్లు అయితే 40% వరకు వేడిని తగ్గిస్తాయి.
3. రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచండి: రాత్రి ఇంకా ఉదయం సమయంలో చల్లని గాలి కోసం కిటికీలు తెలిచి ఉంచండి. ఎదురెదురుగా కిటికీలు, తలుపులు తెరిస్తే క్రాస్ వెంటిలేషన్ ద్వారా గది కొంత చల్లబడుతుంది.
4. ఐస్ లేదా కూల్ వాటర్ ట్రిక్: ఫ్యాన్ ముందు ఒక గిన్నెలో ఐస్ లేదా చల్లని నీళ్లు పెట్టండి. గాలి వీటిపై నుండి వీచినప్పుడు మీ రూమ్ చల్లగా మారుతుంది. ఇంకా పొడి వాతావరణంలో బాగా పనిచేస్తుంది.
5. ఇంట్లోనే కూర్చోండి లేదా పడుకోండి: వేడి గాలి పైకి వెళ్తుంది కాబట్టి ఇంట్లో కింద చల్లగా ఉంటుంది. నేలపై కూర్చోవడం లేదా పడుకోవడం కూడా రిలీఫ్ కలిగిస్తుంది.
6. లైట్ వేట్ దుస్తులు: కాటన్ లాంటి లైట్ వేట్, గాలి బాగా వచ్చే దుస్తులు వేసుకోండి. ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
7. దుప్పట్లు ఫ్రిజ్‌లో పెట్టండి: పడుకునే ముందు మీ దుప్పట్లు లేదా సాక్స్‌లను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచితే నిద్రపోయేటప్పుడు చల్లగా ఉంటుంది.
8. తడి టవల్ లేదా స్ప్రే బాటిల్: తడి టవల్‌ను ఒంటిపై వేసుకోవడం లేదా చల్లని నీటిని ముఖం పై స్ప్రే చేసుకోవడం ద్వారా ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది.
9. వేడి పుట్టించే వాటికి దూరంగా ఉండండి: మీ ఇంట్లో వాడని లైట్లు, కంప్యూటర్లు ఉంటే ఆఫ్ చేసి ఉంచండి. తక్కువ వేడినిచ్చే LED బల్బులు వాడండి.
10. నీళ్లు బాగా తాగండి: శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. పండ్లు, జ్యుసులు లాంటి చల్లని ఆహారాలు తీసుకోండి. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ సింపుల్ టెక్నిక్స్‌తో మీరు ఏసీ లేకుండానే ఈ వేసవిని హాయిగా గడపవచ్చు. మీ కరెంట్ బిల్లు ఆదా అవుతుంది, పర్యావరణానికి మేలు కూడా చేసిన వారు అవుతారు!


Click it and Unblock the Notifications