Doms Industries IPO: డిసెంబర్ మాసంలో ఐపీవోల నుంచి మంచి డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తులకు మంచి అవకాశం వచ్చింది. తాజాగా డిసెంబర్ 13న కొత్త ఐపీవో ఇన్వెస్టర్ల కోసం తెరుచుకుంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీవో గురించే. కంపెనీ ప్రస్తుతం స్టేషనరీ, ఆర్ట్ ఉత్పత్తుల తయారీ వ్యాపారంలో ఉంది. తాజాగా డోమ్స్ తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.750-790గా నిర్ణయించింది. ఈ నెలలో ప్రారంభమౌతున్న తొలి ఐపీవో కావటం విశేషం. కంపెనీ ఐపీవో డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు అందుబాటులో ఉండనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో డిసెంబర్ 12న తెరవబడుతోంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,200 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ మెుత్తంలో రూ.350 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ఉంటుండగా.. మిగిలిన రూ.850 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో కంపెనీ ఐపీవోలో విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఇటలీకి చెందిన కార్పొరేట్ ప్రమోటర్ FILA కంపెనీలోని తన రూ.800 కోట్ల వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్ముతుండగా.. ప్రమోటర్లు సంజయ్ మన్సుఖ్లాల్ రజనీ, కేతన్ మన్సుఖ్లాల్ రజనీలు రూ.25 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేస్తున్నారు.
తాజా ఐపీవోలో కంపెనీ తన ఉద్యోగుల కోసం రూ.5 కోట్ల విలువైన షేర్లను రిజర్వు చేసింది. అలాగే వారికి ఒక్కో షేరును రూ.75 తగ్గింపుతో అందిస్తోంది. ఎఫ్‌వై23లో 12 శాతం మార్కెట్ వాటాతో దేశంలో డోమ్స్ రెండవ అతిపెద్ద బ్రాండెడ్ స్టేషనరీ ఉత్పత్తుల తయారీ కంపెనీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, వాటర్ కలర్ పెన్నులు, మార్కర్‌ల కోసం ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు కంపెనీ తాజా ఐపీవో నిధులను వినియోగించాలని చూస్తోంది.
గుజరాత్ కు చెందిన కంపెన తాజా ఐపీవోలో లాట్ పరిమాణాన్ని 18 షేర్లుగా నిర్ణయించింది. ఇందుకోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.14,220 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. మార్చి FY23తో ముగిసిన సంవత్సరానికి నికర లాభం 567.2 శాతం పెరిగి రూ.95.8 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 77.3 శాతం పెరిగి రూ.1,212 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications