ఆ బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే VRS స్కీం, ఎందుకంటే
ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు అవసరం. ఇందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బ్యాంకుల ప్రయివేటీకరణ కోసం ఉద్యోగులకు ఆకర్షణీయైన స్వచ్చంధ పదవీ విరమణ (VRS) స్కీంను తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆకట్టుకునే ప్యాకేజీతో ఉద్యోగులను ముందస్తు రిటైర్మెంట్ వైపు మొగ్గేలా చూస్తున్నాయి.

ప్రయివేటీకరణ ఈజీ కోసం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రయివేటీకరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా బ్యాంకింగ్ ప్రయివేటీకరణకు సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. రెండు బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సురెన్స్ కంపెనీని ప్రయివేటీకరిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకర్షణీయ వీఆర్ఎస్ ద్వారా ప్రయివేటీకరణను సులభతరం చేయాలని భావిస్తున్నారు.

వీఆర్ఎస్ ఆప్షన్ మాత్రమే
వీఆర్ఎస్ బలవంతం కాదని, తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఆప్షన్ మాత్రమేనని, అలాంటి వారికి మంచి ఆర్థిక ప్యాకేజీ ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ఏకీకరణ కోసం కూడా ఇది గతంలో చోటు చేసుకున్నదని చెబుతున్నారు. ప్రయివేటీకరణకు సంబంధించిన బాధ్యతలను నీతి అయోగ్‌కు అప్పగించారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ప్యానెల్ సిఫార్సు చేసింది.

హైలెవల్ కమిటీలో...
ప్రయివేటీకరణకు సంబంధించి నియమించిన హైలెవల్ ప్యానెల్‌లో ఎనకమిక్ అఫైర్స్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ, కార్పోరేట్ అఫైర్స్ సెక్రటరీ, సెక్రటరీ లీగల్ అఫైర్స్, సెక్రటరీ డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, సెక్రటరీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM), సెక్రటరీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్టుమెంట్ ఉన్నారు.


Click it and Unblock the Notifications